కొంత యెడము నీవైనా నే
kontha yedamu neevainaa nee
కొంత యెడము నీవైనా నే సాగలేను నిమిషమైన నిన్ను విడిచి నే బ్రతుకలేను కొంత యెడము నీవైనా మరచిన వేళలో మది నీ పలుకులు సడలి కట్టడలు మలినము తలపులు (2) ప్రేమను పంచే ప్రేమ రూపుడా మరియొక్క మారు మన్నించు విభుడా (2) ||కొంత యెడము||
kontha yedamu neevainaa nee saagaleenu nimissamaina ninnu vidichi nee brathukaleenu kontha yedamu neevainaa marachina veellaloo madi nee palukulu sadali kattadalu malinamu thalapulu (2) preemanu panchee preema ruupudaa mariyokka maaru manninchu vibhudaa (2) ||kontha yedamu||
కనులకు మోహము కమ్మిన క్షణము వినుట మరచె నీ స్వరమును హృదయము కమ్మిన పొరలు కరిగించుటకు నడుపు నీ వైపుకు హృది వెలుగుటకు మదము, మత్సరములు సోకిన తరుణము పాశము, ప్రేమకు విగతము ప్రాప్తము నిరతము స్థిరముగ నున్న అక్షయుడా నిలుపుము నీ కృపలో నన్ను రక్షకుడా మనుజ రూపమున మహిలో నిలిచి మనిషి-కసాధ్యమౌ మరణము గెలిచి నను వరియించగ రానున్న ప్రియుడా నిన్నెదురుకొనగ మతి నియ్యు వరుడా
kanulaku moohamu kammina kssannamu vinuta marache nee svaramunu hrudayamu kammina poralu kariginchutaku nadupu nee vaipuku hrudi velugutaku madamu, mathsaramulu sookina tharunnamu paashamu, preemaku vigathamu praapthamu nirathamu sthiramuga nunna akssayudaa nilupumu nee krupaloo nannu rakssakudaa manuja ruupamuna mahiloo nilichi manissi-kasaadhyamau marannamu gelichi nanu variyinchaga raanunna priyudaa ninnedurukonaga mathi niyyu varudaa