కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే
konthaseepu kanabadi anthaloonee maayamayyee
కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం లోకాన కాదేది శాశ్వతం (2) యేసే నిజ దేవుడు నిత్యజీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు (2) ||కొంతసేపు||
konthaseepu kanabadi anthaloonee maayamayyee aaviri vantidiraa ee jeevitham lookaana kaadeedi shaashvatham (2) yeesee nija deevudu nithyajeevamisthaadu marannamaina jeevamaina ninnu viduvadu (2) ||konthaseepu||
ఎదురౌతారెందరో నీ పయనంలో నిలిచేది ఎందరు నీ అక్కరలో వచ్చేదెవరు నీతో మరణము వరకు ఇచ్చేదేవరు ఆపై నిత్య జీవము నీకు ||యేసే||
edurauthaarendaroo nee payananloo nilicheedi endaru nee akkaraloo vachcheedevaru neethoo marannamu varaku ichcheedeevaru aapai nithya jeevamu neeku ||yeesee||
చెమటోడ్చి సుఖము విడిచి కష్టమునోర్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే సంపాదన ఎవరిదగును యోచించితివా నీ శాపం తాను మోసి పాపం తీసి రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి విశ్రాంతినీయగ నిన్ను పిలువగా నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా
chematoodchi sukhamu vidichi kasstamunoorchi aasthulu sanpaadinchina shaanthi unnadaa ee raathree deevudu nee praannamadigithee sanpaadana evaridagunu yoochinchithivaa nee shaapam thaanu moosi paapam theesi rakssanna bhaagyamu neekai siddhamu cheesi vishraanthineeyaga ninnu piluvagaa nirlakssyamu cheesina thappinchukonduvaa