కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను
kooti kaanthula velugulathoo udayinchenu
కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం లోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణం దివిని విడిచి భువిని మనకై మానవునిగా జన్మించెను దిగులు చెందక గతము మరచి యేసుని ఆరాధింతుము లోకానికే ఇది పర్వదినం మహదానందమే ప్రతి క్షణం – (2) ||కోటి కాంతుల||
kooti kaanthula velugulathoo udayinchenu oka kirannam lookamanduna prathi hrudayam chigurinchenu ee tharunnam divini vidichi bhuvini manakai maanavunigaa janminchenu digulu chendaka gathamu marachi yeesuni aaraadhinthumu lookaanikee idi parvadinam mahadaanandamee prathi kssannam – (2) ||kooti kaanthula||
రాజులకు రాజుల రాజు ప్రభువులకు ప్రభువే తానుగా మనుజులకు మాదిరి తానై ఉండుటకే ఇల ఏతెంచెగా (2) మనకోసమే జన్మించెను తన ప్రేమనే పంచెను ఆ వరమునే తను విడచెను నరరూపిగా వెలసెను సృష్టికే మూలాధారమైన దేవుడే ఇల దిగి వచ్చెనా శోధనా బాధలు ఎన్ని ఉన్నా నేటితో ఇక దరి చేరునా ఆనందమే ఇక సంతోషమే ప్రతివానికి శుభపరిణామమే – మహిమగల మహిమోన్నతుడు పశువులశాలలో పసివానిగా కరుణగల కారణజన్ముడు శిశువుగా మనలో ఒకవానిగా ఏనాటికి మన తోడుగా ఉండాలని అండగా ప్రతివానికి స్నేహితునిగా హృదయాన జన్మించెగా అంధకారపు ఈ లోకమందు దేవదేవుడు ఉదయించెగా ఎన్నడూ లేని వేవేల కాంతులు లోకమందున పవళించెగా సంతోషమే సమాధానమే ఇది దేవాది దేవుని బహుమానమే –
raajulaku raajula raaju prabhuvulaku prabhuvee thaanugaa manujulaku maadiri thaanai undutakee ila eethenchegaa (2) manakoosamee janminchenu thana preemanee panchenu aa varamunee thanu vidachenu nararuupigaa velasenu srusstikee muulaadhaaramaina deevudee ila digi vachchenaa shoodhanaa baadhalu enni unnaa neetithoo ika dari cheerunaa aanandamee ika santhoossamee prathivaaniki shubhaparinnaamamee – mahimagala mahimoonnathudu pashuvulashaalaloo pasivaanigaa karunnagala kaarannajanmudu shishuvugaa manaloo okavaanigaa eenaatiki mana thoodugaa undaalani andagaa prathivaaniki sneehithunigaa hrudayaana janminchegaa andhakaarapu ee lookamandu deevadeevudu udayinchegaa ennaduu leeni veeveela kaanthulu lookamanduna pavallinchegaa santhoossamee samaadhaanamee idi deevaadi deevuni bahumaanamee –