క్రీస్తేసు పుట్టెను.. లోక రక్షకునిగా
kreestheesu puttenu.. looka rakssakunigaa
క్రీస్తేసు పుట్టెను.. లోక రక్షకునిగా.. పశులపాక పావనమై.. పరవశించెనుగా… పరవశించెనుగా… క్రీస్తేసు పుట్టెను లోక రక్షకునిగా పశులపాక పావనమై పరవశించెనుగా గొర్రెల కాపరులు సంతోషముతో గంతులు వేసెను ఆనందముతో (2) తూర్పు దిక్కున చుక్క వెలిసెను లోక రక్షకుడు భువికి వచ్చెను (2) ||క్రీస్తేసు||
kreestheesu puttenu.. looka rakssakunigaa.. pashulapaaka paavanamai.. paravashinchenugaa… paravashinchenugaa… kreestheesu puttenu looka rakssakunigaa pashulapaaka paavanamai paravashinchenugaa gorrela kaaparulu santhoossamuthoo ganthulu veesenu aanandamuthoo (2) thuurpu dikkuna chukka velisenu looka rakssakudu bhuviki vachchenu (2) ||kreestheesu||
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ ఆదివాక్యము శరీరధారియై లోకమందు సంచరించెను చీకటిని చీల్చి జనులందరికి వెలుగును ప్రసాదించెను పాపములు తీసి పరిశుద్ధపరచి రక్షణ వరమందించే ఆ యేసు రాజును స్తుతియించి ఘనపరచ రారండి (2) ||తూర్పు దిక్కున||
hyaappee hyaappee krismas merri merri krismas aadivaakyamu shareeradhaariyai lookamandu sancharinchenu cheekatini cheelchi janulandariki velugunu prasaadinchenu paapamulu theesi parishuddhaparachi rakssanna varamandinchee aa yeesu raajunu sthuthiyinchi ghanaparacha raarandi (2) ||thuurpu dikkuna||
సంతోషము సమాధానము కృపా కనికరము మన జీవితములో ప్రవేశించెను బహుదీవెనకరము సంబరాలతో సంతోషాలతో వేడుకొన రారండి బంగారము సాంబ్రాణి బోళము సమర్పించ రారండి
santhoossamu samaadhaanamu krupaa kanikaramu mana jeevithamuloo praveeshinchenu bahudeevenakaramu sanbaraalathoo santhoossaalathoo veedukona raarandi bangaaramu saanbraanni boollamu samarpincha raarandi