క్రీస్తు సాక్షిగ నీవు ఉంటావా
kreesthu saakssiga neevu untaavaa
క్రీస్తు సాక్షిగ నీవు ఉంటావా నీదు సాక్ష్యము నిలుపుకుంటావా అన్యజనుల మధ్యన క్రీస్తు మధురనామము నీ వలన దూషింపబడుచున్నదా నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా
kreesthu saakssiga neevu untaavaa needu saakssyamu nilupukuntaavaa anyajanula madhyana kreesthu madhuranaamamu nee valana duussinpabaduchunnadaa nee kriyala valana avamaanam ponduchunnadaa
యవ్వనుడు యేసేపు ఐగుప్తు దేశమందున యెహోవాను ఘనపరిచాడు పోతెఫరు భార్య యొక్క కామ క్రోధ చేష్టలకు లొంగక తప్పించుకున్నాడు తన సాక్ష్యము నిలుపుకున్నాడు ||క్రీస్తు||
yavvanudu yeeseepu aigupthu deeshamanduna yehoovaanu ghanaparichaadu poothepharu bhaarya yokka kaama kroodha cheesstalaku longaka thappinchukunnaadu thana saakssyamu nilupukunnaadu ||kreesthu||
చెరలోనున్న యూదా దాసి సిరియా దేశమందున యెహోవాను ఘనపరిచింది కుష్టు రోగి నయమానును షోమ్రోనుకు వెళ్లమన్నది ఎలీషా ప్రవక్త యొద్దకు, తన సాక్ష్యము నిలుపుకున్నది ||క్రీస్తు||
cheraloonunna yuudaa daasi siriyaa deeshamanduna yehoovaanu ghanaparichindi kusstu roogi nayamaanunu ssoomroonuku velllamannadi eleessaa pravaktha yoddaku, thana saakssyamu nilupukunnadi ||kreesthu||
దైవజనుడు దానియేలు బబులోను దేశమందున యెహోవాను ఘనపరిచాడు తన దేవునికే తప్ప అన్యమైన ప్రతిమలకు ఏ మాత్రం మొక్కనన్నాడు తన సాక్ష్యము నిలుపుకున్నాడు ||క్రీస్తు||
daivajanudu daaniyeelu babuloonu deeshamanduna yehoovaanu ghanaparichaadu thana deevunikee thappa anyamaina prathimalaku ee maathram mokkanannaadu thana saakssyamu nilupukunnaadu ||kreesthu||