క్రీస్తుని స్వరము విందును ప్రభువే
kreesthuni svaramu vindunu prabhuvee
క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మధుర స్వరమేయది మెల్లని స్వరమేయది – యెహోవా నీ స్వరము జలములపై వినబడెను మహిమగల దేవుడు ఉరుమువలె గర్జించెను (2) ||క్రీస్తుని||
kreesthuni svaramu vindunu prabhuvee palikinappudu madhura svarameeyadi mellani svarameeyadi – yehoovaa nee svaramu jalamulapai vinabadenu mahimagala deevudu urumuvale garjinchenu (2) ||kreesthuni||
బలమైన నీ స్వరము బహుప్రభావము గలది దేవదారుల విరచును ప్రజ్వలింప చేయునగ్నిని అద్భుత ప్రభు స్వరము అరణ్యము కదిలించును ఆకుల రాలజేయును లేళ్ళ నీనజేయును ఆలయమందన్నియు ఆయననే ఘనపరచున్ ఆశీర్వాదము శాంతి నొసగునాయన స్వరమే నీ మధుర స్వరము నీ వాక్యమును విందున్ ప్రార్థనల యందున ప్రతిదినము పల్కెదవు నీ మధుర స్వరము నీ చిత్తము తెల్పును అనుదిన జీవితములో అనుసరించెద నిన్ను నీ మధుర స్వరము నీ మార్గము జూపును కుడి యెడమల తిరిగిన నీ స్వరమే వినబడును తుఫానులు కలిగి భయభీతులలో నుండ భయపడకు మని పలికె ప్రేమగల నీ స్వరము మరణాంధకార లోయలో నేనుండ నీకు తోడైయుంటి ననెడి స్వరమును వింటిన్ ప్రభువా సెలవిమ్ము నీ దాసుడాలించున్ దీనుడనై నీ మాట అంగీకరించెదను
balamaina nee svaramu bahuprabhaavamu galadi deevadaarula virachunu prajvalinpa cheeyunagnini adbhutha prabhu svaramu arannyamu kadilinchunu aakula raalajeeyunu leelllla neenajeeyunu aalayamandanniyu aayananee ghanaparachun aasheervaadamu shaanthi nosagunaayana svaramee nee madhura svaramu nee vaakyamunu vindun praarthanala yanduna prathidinamu palkedavu nee madhura svaramu nee chiththamu thelpunu anudina jeevithamuloo anusarincheda ninnu nee madhura svaramu nee maargamu juupunu kudi yedamala thirigina nee svaramee vinabadunu thuphaanulu kaligi bhayabheethulaloo nunda bhayapadaku mani palike preemagala nee svaramu marannaandhakaara looyaloo neenunda neeku thoodaiyunti nanedi svaramunu vintin prabhuvaa selavimmu nee daasudaalinchun deenudanai nee maata angeekarinchedanu