కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి

kummari oo kummari jagatutpattidaari

🎵 TG-1329🎤 Vedala Hema Chandra & Sireesha Bhagavatula💿 Produced & Presented by : Rajesh RavuriLate Rev. C.A.J. Prasad Rao · Late Rev. C.A.J. Prasad Rao🌐 Telugu
పల్లవి

కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తిదారి జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా

1వ చరణం

పనికిరాని పాత్రణని - పారవేయకుమా పొంగి పొరలు పాత్రగా - నన్నునింపుమా సువార్త లోనీ పాత్రలన్నీ - శ్రీయేసుని పొగడచుండ సాక్షిగా నుండు పాత్రగా జేసీ -సత్యముతో నింపుము తండ్రి "కుమ్మరి"

2వ చరణం

విలువలేని పాత్రను నేను- కోనువారు లెరెవ్వరు వెలలేనినీదు రక్తంబుతో - వెలుగొందు పాత్రగా జేసీ ఆటంకముల నుండి - నను తపించి ఎల్లప్పుడూ కాయుమయ పగిలివున్న పాత్రను నేను - సరిచేసివాడుమయ " కుమ్మరి"

3వ చరణం

లోకాశలతో నిండి ఉప్పొంగుచు - మార్గంబునే దప్పితిన్ మనుస్వెచలన్నియూ స్తిరమనుచునే - మనశ్శాంతి కోల్పోతిని పోగొట్టుకొన్న పాత్రయనుచు - పరుగెత్తి నను పట్టితిని ప్రానంబు నాలో ఉన్నప్పుడే - నీ పాధంబుల్ పట్టితీన్ " కుమ్మరి "

Report Error