లెక్కింపగ తరమా నీ మేలులు
lekkinpaga tharamaa nee meelulu
లెక్కింపగ తరమా నీ మేలులు వివరింపగ తరమా నీ కార్యములు (2) నీవిచ్చిన బహుమానం బహు శ్రేష్టము నీకిచ్చే స్తుతియాగం స్వీకరించుము (2) ||లెక్కింపగ||
lekkinpaga tharamaa nee meelulu vivarinpaga tharamaa nee kaaryamulu (2) neevichchina bahumaanam bahu shreesstamu neekichchee sthuthiyaagam sveekarinchumu (2) ||lekkinpaga||
నీ ప్రేమలోనే తను ఎదగాలి నీ రక్షణలోనే కొనసాగాలి నీ సన్నిధి చేరి నీ జ్ఞానముతోని నిరతం నిన్నే స్తుతియించాలి తన జీవితమంతా నీ రెక్కల క్రింద నిన్నే ఎల్లప్పుడు సేవించాలి (2) ||లెక్కింపగ||
nee preemaloonee thanu edagaali nee rakssannaloonee konasaagaali nee sannidhi cheeri nee jnyaanamuthooni niratham ninnee sthuthiyinchaali thana jeevithamanthaa nee rekkala krinda ninnee ellappudu seevinchaali (2) ||lekkinpaga||
నీ వాక్యము తన హృదిలో ఉండాలి నీ తలంపులు మదిలో నిండాలి నీ దయయందు మనుష్యుల దయయందు ప్రతి యేటా దీవెనలతో వర్ధిల్లాలి నీ ఆత్మ బలముతో స్థిరమైన మనస్సుతో ప్రతి చోట నీ సాక్షిగ జీవించాలి (2) ||లెక్కింపగ||
nee vaakyamu thana hrudiloo undaali nee thalanpulu madiloo nindaali nee dayayandu manussyula dayayandu prathi yeetaa deevenalathoo vardhillaali nee aathma balamuthoo sthiramaina manassuthoo prathi choota nee saakssiga jeevinchaali (2) ||lekkinpaga||