లెమ్ము తేజరిల్లుము నీకు - వెలుగు వచ్చియున్నాది
lemmu theejarillumu neeku - velugu vachchiyunnaadi
లెమ్ము తేజరిల్లుము నీకు - వెలుగు వచ్చియున్నాది యెహోవా మహిమ నీపై - ప్రాకాశముగా నుదయించె ||లెమ్ము||
lemmu theejarillumu neeku - velugu vachchiyunnaadi yehoovaa mahima neepai - praakaashamugaa nudayinche ||lemmu||
జనములు నీదు వెలుగునకు - పరుగెత్తి వచ్చెదరు రాజులు నీదు ఉదయ - కాంతీకి వచ్చెదరు||లెమ్ము||
janamulu needu velugunaku - parugeththi vachchedaru raajulu needu udaya - kaantheeki vachchedaru||lemmu||
సముద్ర వ్యాపారము - నీవైపు త్రిప్పబడును జనముల ఐశ్వర్యము - నీ యెద్దకు వచ్చును ||లెమ్ము||
samudra vyaapaaramu - neevaipu thrippabadunu janamula aishvaryamu - nee yeddaku vachchunu ||lemmu||
దేవదారు సరళ గొంజి - చెట్లు నా ఆలయమునకు తేబడును నీదు పాద - స్థలము మహిమ పరచెదను ||లెమ్ము||
deevadaaru saralla gonji - chetlu naa aalayamunaku theebadunu needu paada - sthalamu mahima parachedanu ||lemmu||
నిన్ను శాశ్వతమైన - శోభాతి శయముగ జేతున్ బహు తరములకు సంతోష - కారణముగా జేసేదన్ ||లెమ్ము||
ninnu shaashvathamaina - shoobhaathi shayamuga jeethun bahu tharamulaku santhoossa - kaarannamugaa jeeseedan ||lemmu||
వారిలో ఒంటరియైనా - వాడు పది వందాలగును ఎన్నీక లేని వాడు - బలమైనట్టి జనమగును ||లెమ్ము||
vaariloo ontariyainaa - vaadu padi vandaalagunu enneeka leeni vaadu - balamainatti janamagunu ||lemmu||