మాధుర్యమే నా ప్రభుతో జీవితం
maadhuryamee naa prabhuthoo jeevitham
మాధుర్యమే నా ప్రభుతో జీవితం మహిమానందమే – మహా ఆశ్చర్యమే ||మాధుర్యమే||
maadhuryamee naa prabhuthoo jeevitham mahimaanandamee – mahaa aashcharyamee ||maadhuryamee||
సర్వ శరీరులు గడ్డిని పోలిన వారైయున్నారు వారి అందమంతయు పువ్వు వలె వాడిపోవును – వాడిపోవును నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే దేవుని యందలి భయ భక్తులతో ఉండుటే మేలు – ఉండుటే మేలు నా విమోచన క్రయ ధనమును చెల్లించెను ప్రభువే నా రోగమంతయు సిలువలో పరిహరించెను – పరిహరించెను వాడబారని కిరీటమునకై నన్ను పిలిచెను తేజోవాసులైన పరిశుద్ధులతో ఎపుడు చేరెదనో – ఎపుడు చేరెదనో
sarva shareerulu gaddini poolina vaaraiyunnaaru vaari andamanthayu puvvu vale vaadipoovunu – vaadipoovunu nemmadi leekundaa visthaaramaina dhanamunduta kantee deevuni yandali bhaya bhakthulathoo undutee meelu – undutee meelu naa vimoochana kraya dhanamunu chellinchenu prabhuvee naa roogamanthayu siluvaloo pariharinchenu – pariharinchenu vaadabaarani kireetamunakai nannu pilichenu theejoovaasulaina parishuddhulathoo epudu cheeredanoo – epudu cheeredanoo