మానవులందరు ఒక్కటేనని మదిలో మన
maanavulandaru okkateenani madiloo mana
మానవులందరు ఒక్కటేనని మదిలో మన దేవుడు ఒక్కడేనని (2) అందరు అందురు – వీనుల విందుగా (మరి) లోకాన జరిగేది మార్పుగా (2) ||మానవులందరు||
maanavulandaru okkateenani madiloo mana deevudu okkadeenani (2) andaru anduru – veenula vindugaa (mari) lookaana jarigeedi maarpugaa (2) ||maanavulandaru||
క్రీస్తు సిలువకు సాక్షులమందురు సాక్ష్యములిచ్చినా సాకులు మానరు ప్రార్ధనకొచ్చినా పాపం మానరు ప్రభువేల వానిని క్షమియించును మరి వారేల క్షమియింపబడుదురు ||మానవులందరు||
kreesthu siluvaku saakssulamanduru saakssyamulichchinaa saakulu maanaru praardhanakochchinaa paapam maanaru prabhuveela vaanini kssamiyinchunu mari vaareela kssamiyinpabaduduru ||maanavulandaru||
మార్పులు చెందినా మాటలు మారవు మనుషులు కలిసినా మనసులు కలువవు చేతులు కలిపినా హృదయం కలవదు పైపైకి వందనంబులనుదురు మరి వారేల నీతిమంతులవుదురు
maarpulu chendinaa maatalu maaravu manussulu kalisinaa manasulu kaluvavu cheethulu kalipinaa hrudayam kalavadu paipaiki vandananbulanuduru mari vaareela neethimanthulavuduru