మధురం మధురం దైవ వాక్యం
madhuram madhuram daiva vaakyam
మధురం మధురం దైవ వాక్యం తేనెకన్న మధురం దేవుని వాక్యం చీకటి నిండిన వీదులలో కాంతిని వెదజల్లు దైవవాక్యం అ.ప:జీవమున్న వాక్యం,జీవమిచ్చు వాక్యం దేవుని దివ్య వాక్యం...
madhuram madhuram daiva vaakyam theenekanna madhuram deevuni vaakyam cheekati nindina veedulaloo kaanthini vedajallu daivavaakyam a.pa:jeevamunna vaakyam,jeevamichchu vaakyam deevuni divya vaakyam...
ఖడ్గము కంటెను వాడిగలది ప్రాణాత్మలను విభజించెడి వాక్యం హృదయమునందలి చింతలను పరిశోదించెడి దైవ వాక్యం ||జీవమున్న||
khadgamu kantenu vaadigaladi praannaathmalanu vibhajinchedi vaakyam hrudayamunandali chinthalanu parishoodinchedi daiva vaakyam ||jeevamunna||
నాహృదయములో దైవ వాక్యం పదిలపరచుకొని యున్నందున పాపములో...నే తడబడకుండ అడుగులు కాపాడు దైవ వాక్యం ||జీవమున్న||
naahrudayamuloo daiva vaakyam padilaparachukoni yunnanduna paapamuloo...nee thadabadakunda adugulu kaapaadu daiva vaakyam ||jeevamunna||
కష్టములలోన దైవవాక్యం నెమ్మది నిచ్చి నడిపించును అలసిన,కృంగిన వేళలలో జీవింపచేయు దైవ వాక్యం ||జీవమున్న||
kasstamulaloona daivavaakyam nemmadi nichchi nadipinchunu alasina,krungina veellalaloo jeevinpacheeyu daiva vaakyam ||jeevamunna||