మహాత్ముడైన నా ప్రభు విచిత్ర
mahaathmudaina naa prabhu vichithra
మహాత్ముడైన నా ప్రభు విచిత్ర సిల్వ జూడ నా యాస్తిన్ నష్టంబుగా నెంచి గర్వం బణంగ ద్రొక్కుదున్ నీ సిల్వ గాక యో దేవా దేనిన్ బ్రేమింప నీయకు నాన్నాహరించు సర్వమున్ నీ సిల్వకై త్యజింతును శిరంబు పాద హస్తముల్ సూచించు దుఃఖ ప్రేమలు మరెన్నడైన గూడెనా విషాద ప్రేమ లీ గతిన్? ముండ్లన్ దుర్మార్గులల్లిన కిరీట మేసు కుండినన్ ఈ భూ కిరీటములన్ని దానం దూగంగ జాలు నే? లోకంబు నే నేర్పించిన నయోగ్యమైన యీవి యౌ వింతైన యేసు ప్రేమకై నా యావజ్జీవ మిత్తును రక్షింప బడ్డ లోకమా రక్షింప జావు బొందిన రక్షకు-డేసు నిన్ సదా రావంబు తోడ గొల్వుమా
mahaathmudaina naa prabhu vichithra silva juuda naa yaasthin nasstanbugaa nenchi garvam bannanga drokkudun nee silva gaaka yoo deevaa deenin breeminpa neeyaku naannaaharinchu sarvamun nee silvakai thyajinthunu shiranbu paada hasthamul suuchinchu duhkha preemalu marennadaina guudenaa vissaada preema lee gathin? mundlan durmaargulallina kireeta meesu kundinan ee bhuu kireetamulanni daanam duuganga jaalu nee? lookanbu nee neerpinchina nayoogyamaina yeevi yau vinthaina yeesu preemakai naa yaavajjeeva miththunu rakssinpa badda lookamaa rakssinpa jaavu bondina rakssaku-deesu nin sadaa raavanbu thooda golvumaa