మహిమాన్వితము మనోహరము నీ దివ్య
mahimaanvithamu manooharamu nee divya
మహిమాన్వితము మనోహరము నీ దివ్య సన్నిధానము (2) నిన్నే కోరానయ్య – నిన్నే చేరానయ్య నీవే కావాలని యేసయ్య (2) ||మహిమాన్వితము||
mahimaanvithamu manooharamu nee divya sannidhaanamu (2) ninnee kooraanayya – ninnee cheeraanayya neevee kaavaalani yeesayya (2) ||mahimaanvithamu||
కోరలేదు ధన సంపద కోరినాను నిను మాత్రమే ఐశ్వర్యము కంటే అధికుడవు నీ ఆశ్రయమే చాలునయా (2) ||నిన్నే||
kooraleedu dhana sanpada koorinaanu ninu maathramee aishvaryamu kantee adhikudavu nee aashrayamee chaalunayaa (2) ||ninnee||
జీవపు ఊటలు కల చోటికి జీవ నదులు పారే చోటికి ప్రేమతో పిలచిన నా యేసయ్యా నా దాహమును తీర్చెదవు (2) ||నిన్నే||
jeevapu uutalu kala chootiki jeeva nadulu paaree chootiki preemathoo pilachina naa yeesayyaa naa daahamunu theerchedavu (2) ||ninnee||
తేజోనివాసుల నివాసము చేరాలనునదే నా ఆశయ్యా యుగయుగములు నే నీతో ఉండి నిత్యారాధన చేయాలని
theejoonivaasula nivaasamu cheeraalanunadee naa aashayyaa yugayugamulu nee neethoo undi nithyaaraadhana cheeyaalani