మన మధ్యన దూరం ఎంతో
mana madhyana duuram enthoo
మన మధ్యన దూరం ఎంతో ఎత్తైనది మేమెక్కలేనంత ఎత్తైన పర్వతం నిరాశలో మేము నీ వైపు చూచి నీ నామములో విడుదలను ప్రకటించితిమి అంధకారము తొలగించి మా ఆత్మను రక్షించి నీ ప్రేమతో మమ్ము నింపినావయ్యా పరిపూర్ణమైనది నీవు రచియించిన అంతం యేసు ప్రభూ నీవే మా నిరీక్షణ ఊహలకు అందనిది నీ కరుణ కటాక్షం మాపై కురిపించితివి సమృద్ధిగను యుగయుగములకు రాజా నీ మహిమను విడచి మా శాప భారము నీవే భరియించితివి నీ సిలువలో మేము పొందితిమి క్షమాపణ మేము నీవారిగా మార్చబడితిమి సుందరుడా యేసయ్యా మేము నీ వారము హల్లెలూయా ప్రభువా నిన్నే స్తుతియింతున్ హల్లెలూయా నీవు మరణము గెలిచితివి నీ నామంలో రక్షణను మాకు విజయమునిచ్చితివి (2) నీవు లేచిన ఉదయాన నెరవేరెను వాగ్ధానం నిర్జీవ శరీరం శ్వాసించెనుగా నిశ్శబ్దములో నుండి నీవు పలికిన జయభేరి “ఓ మరణమా నీ జయమెక్కడ?” యేషువా నీకే జయమెప్పుడు యేసు ప్రభూ నీవే మా నిరీక్షణ –
mana madhyana duuram enthoo eththainadi meemekkaleenantha eththaina parvatham niraashaloo meemu nee vaipu chuuchi nee naamamuloo vidudalanu prakatinchithimi andhakaaramu tholaginchi maa aathmanu rakssinchi nee preemathoo mammu ninpinaavayyaa paripuurnnamainadi neevu rachiyinchina antham yeesu prabhuu neevee maa nireekssanna uuhalaku andanidi nee karunna kataakssam maapai kuripinchithivi samruddhiganu yugayugamulaku raajaa nee mahimanu vidachi maa shaapa bhaaramu neevee bhariyinchithivi nee siluvaloo meemu pondithimi kssamaapanna meemu neevaarigaa maarchabadithimi sundarudaa yeesayyaa meemu nee vaaramu halleluuyaa prabhuvaa ninnee sthuthiyinthun halleluuyaa neevu marannamu gelichithivi nee naamanloo rakssannanu maaku vijayamunichchithivi (2) neevu leechina udayaana neraveerenu vaagdhaanam nirjeeva shareeram shvaasinchenugaa nishshabdamuloo nundi neevu palikina jayabheeri “oo marannamaa nee jayamekkada?” yeessuvaa neekee jayameppudu yeesu prabhuu neevee maa nireekssanna –