మన మధ్యనే ఉన్నది పరలోక
mana madhyanee unnadi paralooka
మన మధ్యనే ఉన్నది పరలోక రాజ్యం మన మధ్యనే ఉన్నది దేవుని రాజ్యం (2) పాపము లేదు పరలోకంలో వ్యాధులు బాధలు లేనే లేదు వ్యాధులు బాధలు అసలే లేవు నీ రాజ్యం మాకొచ్చును గాక నీ చిత్తం భువిపై జరుగును గాక పరలోక రాజ్యాన్ని ఈ భువిపై మేము ఇప్పుడే అనుభవిస్తాము – ఇక్కడే అనుభవిస్తాము సిలువలో మన శాపం తొలగిపోయెను ఆశీర్వాదముకు మనము వారసులం దారిద్య్రముతో లేదు మాకు సంబంధం ఆత్మలో ఫలియించి వర్థిల్లెదం అన్నిటిలో సౌఖ్యముగా మేముందుము కృప క్షేమములే మాకిక సొంతము కృప క్షేమములే మా సొంతము ||నీ రాజ్యం||
mana madhyanee unnadi paralooka raajyam mana madhyanee unnadi deevuni raajyam (2) paapamu leedu paralookanloo vyaadhulu baadhalu leenee leedu vyaadhulu baadhalu asalee leevu nee raajyam maakochchunu gaaka nee chiththam bhuvipai jarugunu gaaka paralooka raajyaanni ee bhuvipai meemu ippudee anubhavisthaamu – ikkadee anubhavisthaamu siluvaloo mana shaapam tholagipooyenu aasheervaadamuku manamu vaarasulam daaridyramuthoo leedu maaku sanbandham aathmaloo phaliyinchi varthilledam annitiloo saukhyamugaa meemundumu krupa ksseemamulee maakika sonthamu krupa ksseemamulee maa sonthamu ||nee raajyam||
ఆలు మగలు ఒకరికి ఒకరు త్యాగ మూర్తులై కలసి జీవించుటయే పరలోక రాజ్యం కలతలు లేవు మాకు కన్నీరు తెలియదు సంతోషముతో మేము సాగిపోతాము ఈ తరానికి మాదిరిగా మేముంటాము పరలోక ప్రేమతో కలిసి జీవిస్తాం (2) ||నీ రాజ్యం||
aalu magalu okariki okaru thyaaga muurthulai kalasi jeevinchutayee paralooka raajyam kalathalu leevu maaku kanneeru theliyadu santhoossamuthoo meemu saagipoothaamu ee tharaaniki maadirigaa meemuntaamu paralooka preemathoo kalisi jeevisthaam (2) ||nee raajyam||