మందిరములోనికి రారండి
mandiramulooniki raarandi
మందిరములోనికి రారండి వందనీయుడేసుని చేరండి కలవరమైనా కలతలు ఉన్నా పల్లవి: తొలగిపోవును ఆలయాన చేరను కలుగు సుఖములు ఆ ప్రభుని వేడను
mandiramulooniki raarandi vandaneeyudeesuni cheerandi kalavaramainaa kalatalu unnaa pallavi: tolagipoovunu aalayaana cheeranu kalugu sukhamulu aa prabhuni veedanu
దేవుని తేజస్సు నిలచే స్థలమిది క్షేమము కలిగించు ఆశ్రయపురమిది వెంటాడే భయములైనా వీడని అపజయములైనా ||తొలగిపోవును||
deevuni theejassu nilachee sthalamidi ksseemamu kaliginchu aashrayapuramidi ventaadee bhayamulainaa veedani apajayamulainaa ||tholagipoovunu||
సత్యము భోదించు దేవుని బడి ఇది ప్రేమను చాటించు మమతల గుడి ఇది శ్రమలవలన చింతలైనా శత్రువులతో చిక్కులైనా ||తొలగిపోవును||
sathyamu bhoodinchu deevuni badi idi preemanu chaatinchu mamathala gudi idi shramalavalana chinthalainaa shathruvulathoo chikkulainaa ||tholagipoovunu||
శాంతి ప్రసాదించు దీవెన గృహమిది స్వస్థత కలిగించు అమృత జలనిధి కుదుటపడని రోగమైనా ఎదను తొలచు వేదనైనా ||తొలగిపోవును||
shaanthi prasaadinchu deevena gruhamidi svasthatha kaliginchu amrutha jalanidhi kudutapadani roogamainaa edanu tholachu veedanainaa ||tholagipoovunu||