మేలుకో! మహిమ రాజు వేగమే
meelukoo! mahima raaju veegamee
మేలుకో! మహిమ రాజు వేగమే రానై యున్నాడు (2) పరమునుండి – బూర ధ్వనితో అరయు నేసు – ఆర్భాటముతో సర్వలోకము – తేరిచూచును త్వరపడు ఓ ప్రియుండా (2) ||మేలుకో||
meelukoo! mahima raaju veegamee raanai yunnaadu (2) paramunundi – buura dhvanithoo arayu neesu – aarbhaatamuthoo sarvalookamu – theerichuuchunu thvarapadu oo priyundaa (2) ||meelukoo||
గురుతులెల్ల – ధరణియందు సరిగ చూడ – జరుగుచుండ చిరునవ్వుతో – చేరి ప్రభుని క్రీస్తునందు – మృతులెల్లరు కడబూర – మ్రోగగానే క్రీస్తువలె – తిరిగి లేతురు లేతువా? నీవు ప్రియుడా అరయంగ – పరిశుద్ధులు మురిసెదరు – అక్షయ దేహులై పరమందు – ప్రభుక్రీస్తు నిరతము – ఓ ప్రియుండా కరుణలేని – ఓ మరణమా నిరతము నీకు జయమగునా మరణ సంహా – రుండేసు త్వరగా – రానై యున్నాడు మాంసలోక – పిశాచాదులు హింస పరచ – విజృంభించిన లేశమైనను – జడియకుము ఆశతో – కాచుకొనుము పాపమును – చేయకుమా రేపకుమా – దైవ కోపమును శాపమును – తప్పుకొని శ్రద్ధతో – కాచుకొనుమా
guruthulella – dharanniyandu sariga chuuda – jaruguchunda chirunavvuthoo – cheeri prabhuni kreesthunandu – mruthulellaru kadabuura – mroogagaanee kreesthuvale – thirigi leethuru leethuvaa? neevu priyudaa arayanga – parishuddhulu murisedaru – akssaya deehulai paramandu – prabhukreesthu nirathamu – oo priyundaa karunnaleeni – oo marannamaa nirathamu neeku jayamagunaa maranna sanhaa – rundeesu thvaragaa – raanai yunnaadu maansalooka – pishaachaadulu hinsa paracha – vijrunbhinchina leeshamainanu – jadiyakumu aashathoo – kaachukonumu paapamunu – cheeyakumaa reepakumaa – daiva koopamunu shaapamunu – thappukoni shraddhathoo – kaachukonumaa