మోకాళ్ళ అనుభవము నీకు ఉన్నదా
mookaalllla anubhavamu neeku unnadaa
మోకాళ్ళ అనుభవము నీకు ఉన్నదా విసుగక ప్రార్ధించే మనసు ఉన్నదా (2) వెలిగే దీపానికి నూనె అవసరం నీ ఆత్మా దీపానికి ప్రార్ధనవసరం నూనె లేని దీపము ఆరిపోవును ప్రార్ధించలేని జీవితము పతనమవ్వును (2) ||మోకాళ్ళ||
mookaalllla anubhavamu neeku unnadaa visugaka praardhinchee manasu unnadaa (2) veligee deepaaniki nuune avasaram nee aathmaa deepaaniki praardhanavasaram nuune leeni deepamu aaripoovunu praardhinchaleeni jeevithamu pathanamavvunu (2) ||mookaalllla||
శోధనలో పడకుండా ప్రార్ధించుము శోధన తప్పించుటకు ప్రార్ధించుము కన్నీటితో ప్రార్ధించిన హిజ్కియాను చూడుము మరణము తప్పించబడి ఆయుష్షు నొందెను ప్రతి నిమిషమందు మనము ప్రార్ధించగలిగినా పరలోక సంతోషం దేవుడిచ్చును పట్టుదలతో ప్రార్ధించిన ఏలీయాను చూడుము ఆకాశ జలములను మూసివేసెను అడుగుడి మీకివ్వబడును తట్టుడి మీకు తీయబడును అన్నాడు మన యేసు అడిగి చూడుము సకల ఐశ్వర్యములకు కర్త అయిన దేవుడు అడిగిన వారందరికి తప్పక దయచేయును
shoodhanaloo padakundaa praardhinchumu shoodhana thappinchutaku praardhinchumu kanneetithoo praardhinchina hijkiyaanu chuudumu marannamu thappinchabadi aayussssu nondenu prathi nimissamandu manamu praardhinchagaliginaa paralooka santhoossam deevudichchunu pattudalathoo praardhinchina eeleeyaanu chuudumu aakaasha jalamulanu muusiveesenu adugudi meekivvabadunu thattudi meeku theeyabadunu annaadu mana yeesu adigi chuudumu sakala aishvaryamulaku kartha ayina deevudu adigina vaarandariki thappaka dayacheeyunu