ముళ్ళ కిరీటము రక్త ధారలు
mulllla kireetamu raktha dhaaralu
ముళ్ళ కిరీటము రక్త ధారలు పొందిన గాయములు జాలి చూపులు చల్లని చేతులు పరిశుద్ధ పాదములు దిగిన మేకులు వేదన కేకలు ఎంత గొప్పది యేసు నీ హృదయము మా కోసమే ఇన్ని బాధలా ఇంత ప్రేమ ఏలనో సన్నుతింతుము సత్యవంతుడా నిండు భక్తితో ఉప్పొంగు కృతజ్ఞతతో యేసు నీ త్యాగము మరువలేనిది మా జీవితాలకు విలువ నిచ్చినది లోక పాపము సిలువ భారము జనుల పక్షము ఘోర మరణము తండ్రి కార్యము పునరుద్దానము ఉచిత దానము నిత్య జీవము యేసు నీ కృప మాకు చాలును నీ నీతియే మాకు సంపద నిన్ను కీర్తించుట దీవెన మా విమోచకా మా రక్షణాధారమా అందుకోవయా మా స్తుతి అర్పణములు వందనం ప్రభు వందనం నీకు నీ ప్రాణదానముకై సదా వందనం
mulllla kireetamu raktha dhaaralu pondina gaayamulu jaali chuupulu challani cheethulu parishuddha paadamulu digina meekulu veedana keekalu entha goppadi yeesu nee hrudayamu maa koosamee inni baadhalaa intha preema eelanoo sannuthinthumu sathyavanthudaa nindu bhakthithoo uppongu kruthajnyathathoo yeesu nee thyaagamu maruvaleenidi maa jeevithaalaku viluva nichchinadi looka paapamu siluva bhaaramu janula pakssamu ghoora marannamu thandri kaaryamu punaruddaanamu uchitha daanamu nithya jeevamu yeesu nee krupa maaku chaalunu nee neethiyee maaku sanpada ninnu keerthinchuta deevena maa vimoochakaa maa rakssannaadhaaramaa andukoovayaa maa sthuthi arpannamulu vandanam prabhu vandanam neeku nee praannadaanamukai sadaa vandanam