నా బ్రతుకు దినములు లెక్కింప
naa brathuku dinamulu lekkinpa
నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము ||నా బ్రతుకు||
naa brathuku dinamulu lekkinpa neerpumu deevaa ee bhuvini veedu gadiya naaku chuupumu inkontha kaalamu aayussssu penchumu naa brathuku maarchukondunu samayamunimmu ||naa brathuku||
ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని నా మరణ రోదన ఆలకించుమో ప్రభు మరల నన్ను నూతనముగ చిగురు వేయని నీ పిలుపు నేను మరచితి – నా పరుగులో నేనలసితి నా స్వార్ధము నా పాపము – పతన స్థితికి చేర్చెను నా అంతమెటుల నుండునో – భయము పుట్టుచున్నది దేవా నన్ను మన్నించుము – నా బ్రతుకు మార్చుము యేసూ నీ చేతికి ఇక లొంగిపోదును విశేషముగా రూపించుము నా శేష జీవితం
ennoo sanvathsaraalu nannu daatipoovuchunnavi naa aashalu naa kalalanee venbadinchuchuntini phalaalu leeni vrukssamu vale edigipoothini eenaadu kuulipoodunoo erugakuntini naa maranna roodana aalakinchumoo prabhu marala nannu nuuthanamuga chiguru veeyani nee pilupu neenu marachithi – naa paruguloo neenalasithi naa svaardhamu naa paapamu – pathana sthithiki cheerchenu naa anthametula nundunoo – bhayamu puttuchunnadi deevaa nannu manninchumu – naa brathuku maarchumu yeesuu nee cheethiki ika longipoodunu visheessamugaa ruupinchumu naa sheessa jeevitham