నా గుడారము క్షేమమని నాకు
naa gudaaramu ksseemamani naaku
నా గుడారము క్షేమమని నాకు తెలిపితివి (2) నా ఇంటి వస్తువులు లెక్క చూడగా ఏదియు నాకు నష్టముండదు (2) ||నా గుడారము||
naa gudaaramu ksseemamani naaku thelipithivi (2) naa inti vasthuvulu lekka chuudagaa eediyu naaku nasstamundadu (2) ||naa gudaaramu||
కంచె వేసితివి నా చుట్టు నీవు ఘనముగా చెప్పితివి నా విషయమై రాజ్యములు జయించితిని విశ్వాసముతో కృప వెంబడి కృప చూపుచుండగా నా కుటుంబీకులు పచ్చిక వలెను విస్తారమగును నా సంతానము ఆకు వాడక తన కాలమందున ఫలమిచ్చుఁ చెట్టు వలె నేనుందును పితరులు చూడని వాగ్ధాన ఫలమును అనుభవించుచుంటిని నీ దయతో విశ్వాస వీరుడనై నీ ముఖము చూచుచు మరి శ్రేష్ఠమైన దేశము చేరెదను ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు పూర్ణ వయస్సుతో నేను నిన్ను చేరెద నా చేతి పనులన్ని సఫలము చేసి ఆశీర్వాదము నా సొత్తు చేసితివి యాత్రికుడనై పరదేశిగా నేను నివసించుచుంటిని గుడారాలలో మరి శ్రేష్ఠ పునరుత్తానం పొందుటకై మరచిపోతిని నా జన్మ భూమిని (2) ||నా గుడారము||
kanche veesithivi naa chuttu neevu ghanamugaa cheppithivi naa vissayamai raajyamulu jayinchithini vishvaasamuthoo krupa venbadi krupa chuupuchundagaa naa kutunbeekulu pachchika valenu visthaaramagunu naa santhaanamu aaku vaadaka thana kaalamanduna phalamichchum chettu vale neenundunu pitharulu chuudani vaagdhaana phalamunu anubhavinchuchuntini nee dayathoo vishvaasa veerudanai nee mukhamu chuuchuchu mari shreesstthamaina deeshamu cheeredanu dhaanyapu panulu illu cheerunatlu puurnna vayassuthoo neenu ninnu cheereda naa cheethi panulanni saphalamu cheesi aasheervaadamu naa soththu cheesithivi yaathrikudanai paradeeshigaa neenu nivasinchuchuntini gudaaraalaloo mari shreessttha punaruththaanam pondutakai marachipoothini naa janma bhuumini (2) ||naa gudaaramu||