నా ప్రాణం తల్లడిల్లగా భూదిగంతముల
naa praannam thalladillagaa bhuudiganthamula
నా ప్రాణం తల్లడిల్లగా భూదిగంతముల నుండి మొర పెట్టుచున్నాను దేవా నా మొర ఆలకించుమా నా ప్రార్థనకు చెవియొగ్గుమా (2) నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి ఎక్కించుము నను నడిపించుము (2) ||దేవా||
naa praannam thalladillagaa bhuudiganthamula nundi mora pettuchunnaanu deevaa naa mora aalakinchumaa naa praarthanaku cheviyoggumaa (2) neenu ekkaleenantha eththaina konda paiki ekkinchumu nanu nadipinchumu (2) ||deevaa||
నీవు నాకు ఆశ్రయముగ నుంటివి శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి యుగయుగములు నేను నీ గుడారములో నుందును నీ రెక్కల చాటున దాగి యుందును ||దేవా||
neevu naaku aashrayamuga nuntivi shathruvula eduta balamaina kootagaa nuntivi yugayugamulu neenu nee gudaaramuloo nundunu nee rekkala chaatuna daagi yundunu ||deevaa||
నా రక్షణ మహిమకు ఆధారము నీవే నా ఆశ్రయ దుర్గం నా నిరీక్షణ మార్గము నీవే నీ ప్రేమ బాటలో నడిపించుమయ్యా నీ పోలికగా నన్ను మలచుమయ్యా
naa rakssanna mahimaku aadhaaramu neevee naa aashraya durgam naa nireekssanna maargamu neevee nee preema baataloo nadipinchumayyaa nee poolikagaa nannu malachumayyaa