నలుగకుండ గోధుమలు కడుపు నింప
nalugakunda goodhumalu kadupu ninpa
నలుగకుండ గోధుమలు కడుపు నింప గలుగునా కరగకుండ కొవ్వొత్తి కాంతి నివ్వగలుగునా (2) ఆత్మీయ యాత్రలో నలుగుటయే విలువయా ఇరుకైన బాటలో కరుగుటయే వెలుగయా (2) ||నలుగకుండ||
nalugakunda goodhumalu kadupu ninpa galugunaa karagakunda kovvoththi kaanthi nivvagalugunaa (2) aathmeeya yaathraloo nalugutayee viluvayaa irukaina baataloo karugutayee velugayaa (2) ||nalugakunda||
పగలని బండనుండి జలములు హోరులు విరుగని పొలము మనకు పంటలివ్వగలుగునా పరలోక యాత్రలో పగులుటయే ఫలమయా విశ్వాసి బాటలో విరుగుటయే పరమయా రక్తము చిందకుండ పాపములు పోవునా కన్నీరు కార్చకుండ కలుషములు కరుగునా అంతిమ యాత్రలో క్రీస్తేసే గమ్యమయా ఏకాంత బాటలో ప్రభు యేసే శరణమయా బహు దూర బాటలో ప్రభు యేసే శరణమయా ||నలుగకుండ||
pagalani bandanundi jalamulu hoorulu virugani polamu manaku pantalivvagalugunaa paralooka yaathraloo pagulutayee phalamayaa vishvaasi baataloo virugutayee paramayaa rakthamu chindakunda paapamulu poovunaa kanneeru kaarchakunda kalussamulu karugunaa anthima yaathraloo kreestheesee gamyamayaa eekaantha baataloo prabhu yeesee sharannamayaa bahu duura baataloo prabhu yeesee sharannamayaa ||nalugakunda||