నమ్మకురా నమ్మకురా ఈ లోకం

nammakuraa nammakuraa ee lookam

🎵 TG-1630🌐 Telugu
పల్లవి

నమ్మకురా నమ్మకురా ఈ లోకం నమ్మకురా నమ్ముకోరా నమ్ముకోరా ప్రభుయేసుని నమ్ముకోరా (2) మత్తును నమ్మకురా గమ్మత్తులు సేయకురా ఆత్మను హత్తుకోరా ఆరోగ్యం పొందుకోరా ||నమ్మకురా||

1వ చరణం

ధనము చదువు నేర్పునురా – సంస్కారం నేర్పదురా ధనము మందులు కొనునురా – ఆరోగ్యం ఇవ్వదురా వస్తువాహనాల కాధారం సుఖ సంతోషాలకు బహుదూరం (2)        ||నమ్మకురా||

2వ చరణం

ధనము పెళ్ళి చేయునురా – కాపురము కట్టదురా ధనము సమాధి కట్టునురా – పరలోకం చేర్చదురా డబ్బును నమ్మకురా గబ్బు పనులు చేయకురా ధనము ఆస్తిని పెంచునురా – అనురాగం తుంచునురా ధనము పొగరు పెంచునురా – పరువు కాస్త తీయునురా ధనము కోరిక తీర్చునురా నరకానికి చేర్చునురా

Report Error