నన్ను బలపరచు యేసునందే నేను
nannu balaparachu yeesunandee neenu
నన్ను బలపరచు యేసునందే నేను సర్వము చేయగలను నన్ను స్థిరపరచు క్రీస్తునందే నేను సమస్తం చేయగలను సాధ్యము కానిది ఏదియు లేదే అన్ని సాధ్యమే యేసులో అన్ని సాధ్యమే క్రీస్తులో ||నన్ను బలపరచు||
nannu balaparachu yeesunandee neenu sarvamu cheeyagalanu nannu sthiraparachu kreesthunandee neenu samastham cheeyagalanu saadhyamu kaanidi eediyu leedee anni saadhyamee yeesuloo anni saadhyamee kreesthuloo ||nannu balaparachu||
నీటిని చీల్చి – బాటను వేసి – నరులను నడిపించెనే బండను చీల్చి – దాహము తీర్చ – నీటిని పుట్టించెనే నీటిని ద్రాక్షా రసముగ మార్చెనే నీటిపై నడిచెనే – నీటినే అణచెనే నా కన్నీటిని నాట్యముగ మార్చెనే జీవ జలమైన నా యేసయ్యా… ||సాధ్యము||
neetini cheelchi – baatanu veesi – narulanu nadipinchenee bandanu cheelchi – daahamu theercha – neetini puttinchenee neetini draakssaa rasamuga maarchenee neetipai nadichenee – neetinee annachenee naa kanneetini naatyamuga maarchenee jeeva jalamaina naa yeesayyaa… ||saadhyamu||
హోరేబు కొండపై – మండే పొద నుండి – మోషేతో మాట్లాడెనే బలిపీఠముపై – అగ్నిని కురిపించి – మహిమను కనుపరచెనే షద్రకు మేషాకు అబేద్నెగోలను అగ్నిలో ఉండియే కాపాడెనే నరకపు మంటనుండి నను రక్షించిన అగ్ని నేత్రాల నా యేసయ్యా…
hooreebu kondapai – mandee poda nundi – moosseethoo maatlaadenee balipeetthamupai – agnini kuripinchi – mahimanu kanuparachenee ssadraku meessaaku abeednegoolanu agniloo undiyee kaapaadenee narakapu mantanundi nanu rakssinchina agni neethraala naa yeesayyaa…