నర జన్మమెత్తి వరసుతునిగా అరుదెంచె
nara janmameththi varasuthunigaa arudenche
నర జన్మమెత్తి వరసుతునిగా అరుదెంచె నేడు సరసముగా శ్రీ వేల్పుడగు ఆనందమూర్తి క్రీస్తేసు స్వామి ఈ భువిలోన మానసవేది పావనమూర్తి మానవులను పాలించుకర్త నర జన్మమెత్తి… లోకముద్ధరింప పరిశుద్ధ జన్మ మెత్తి కన్య మరియ గర్భవతియాయే (2) || మానసవేది||
nara janmameththi varasuthunigaa arudenche needu sarasamugaa shree veelpudagu aanandamuurthi kreestheesu svaami ee bhuviloona maanasaveedi paavanamuurthi maanavulanu paalinchukartha nara janmameththi… lookamuddharinpa parishuddha janma meththi kanya mariya garbhavathiyaayee (2) || maanasaveedi||
బంతి యనగ యాడరే మన బాల చిన్న ముద్దుల యేసుకు (2) ముత్తిక తోడ కూడి యాడి ముద్దుల పరుడు పల్క పరుడు గ గ గ రి గ మ మ మ మ ప మ ప మ ప ద ని స ప ద ని స.. ప ద ని స.. ప ద ప ద గ మ గ మ గ రి స రి ||బంతి||
banthi yanaga yaadaree mana baala chinna muddula yeesuku (2) muththika thooda kuudi yaadi muddula parudu palka parudu ga ga ga ri ga ma ma ma ma pa ma pa ma pa da ni sa pa da ni sa.. pa da ni sa.. pa da pa da ga ma ga ma ga ri sa ri ||banthi||
జ్ఞానులెల్ల వచ్చిరి మంచి కానుకలర్పించిరి (2) ||ముత్తిక||
jnyaanulella vachchiri manchi kaanukalarpinchiri (2) ||muththika||
జననము నొందెను జయ యేసు జయ గీతములు పాడుడి (2) ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ గొర్రెల కాపరులకు దూత గొప్ప వార్తను తెలిపినట (2) ||జననము||
jananamu nondenu jaya yeesu jaya geethamulu paadudi (2) aa aa aa aa aa aa aa aa aa aa aa aa aa aa gorrela kaaparulaku duutha goppa vaarthanu thelipinata (2) ||jananamu||
శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు పాయక బేత్లెహేమ యూరిలో సత్రమందున పశువుల శాలయందున దేవపుత్రుండు మనుజుండాయెనందున (2) ||శ్రీ యేసుండు||
shree yeesundu janminchee reeyiloo needu paayaka beethleheema yuuriloo sathramanduna pashuvula shaalayanduna deevaputhrundu manujundaayenanduna (2) ||shree yeesundu||
చూడబోదాము రారే సకల జనంబులార శ్రీ యేసు నాథుని జన్మంబు ఆనందముతో మనమందరం ఆహ ||చూడబోదాము||
chuudaboodaamu raaree sakala jananbulaara shree yeesu naathuni janmanbu aanandamuthoo manamandaram aaha ||chuudaboodaamu||
ఘల్లు ఘల్లున మనమెల్లి యేసుని పాదంబు జంబులకు మ్రొక్కెదము (2) ||ఆనందముతో||
ghallu ghalluna manamelli yeesuni paadanbu janbulaku mrokkedamu (2) ||aanandamuthoo||
ఆహ చూడ… ఆహ చూడ… ఆహ చూడబోదాము రారే
aaha chuuda… aaha chuuda… aaha chuudaboodaamu raaree