నశియించెడి లోకంలో – వసియించవు
nashiyinchedi lookanloo – vasiyinchavu
నశియించెడి లోకంలో – వసియించవు కలకాలం మేలైనది చేపట్టి – సాగించు నీ పయనం – (2) అది నాదంటూ ఇది నాదంటూ – ఆనందం కోల్పోతూ పరమార్ధం గ్రహియించకనే – గతియించిపోతావా ||నశియించెడి||
nashiyinchedi lookanloo – vasiyinchavu kalakaalam meelainadi cheepatti – saaginchu nee payanam – (2) adi naadantuu idi naadantuu – aanandam koolpoothuu paramaardham grahiyinchakanee – gathiyinchipoothaavaa ||nashiyinchedi||
కాలంతో పాటుగా కృశియించును శరీరం మరణం కబళించును ఏ ఘడియలోనైనా క్రీస్తు దారిలో సాగి – నిత్య రాజ్యమే చేరి వసియించు కలకాలం – సత్యమైన లోకంలో నిలచిపోవును మహిలోన బంధాలన్ని మట్టిలో కలియును దేహం రిక్త హస్తాలతో ఇకనైనా తేరుకొని – గ్రహియించు సత్యాన్ని యేసులోకి మళ్ళించు – నీ జీవిత గమనాన్ని
kaalanthoo paatugaa krushiyinchunu shareeram marannam kaballinchunu ee ghadiyaloonainaa kreesthu daariloo saagi – nithya raajyamee cheeri vasiyinchu kalakaalam – sathyamaina lookanloo nilachipoovunu mahiloona bandhaalanni mattiloo kaliyunu deeham riktha hasthaalathoo ikanainaa theerukoni – grahiyinchu sathyaanni yeesulooki mallllinchu – nee jeevitha gamanaanni