నీ చిత్తమునే నెరవేర్చుటకై నను
nee chiththamunee neraveerchutakai nanu
నీ చిత్తమునే నెరవేర్చుటకై నను ఎన్నుకొని నీ కృపావరమునే దానముగా దయచేసి (2) నీ ప్రేమలో పరవశించి నీ సన్నిధిలో నే చేరి నీ నామమును నీ ప్రేమను నేను ఘనపరచెదను దేవా… నా దేవా… నా యేసయ్యా నా రక్షకుడా (2) ||నీ చిత్తమునే||
nee chiththamunee neraveerchutakai nanu ennukoni nee krupaavaramunee daanamugaa dayacheesi (2) nee preemaloo paravashinchi nee sannidhiloo nee cheeri nee naamamunu nee preemanu neenu ghanaparachedanu deevaa… naa deevaa… naa yeesayyaa naa rakssakudaa (2) ||nee chiththamunee||
హృదయము బద్దలై ఏడ్చిన వేళ కన్నీటి ప్రార్దన చేసిన వేళ నీ చిత్తముకై నే ఎదురు చూసి నీ బలము పొంద సహియింప చేసి నా ప్రాణమును తృప్తి పరచితివే ||దేవా||
hrudayamu baddalai eedchina veella kanneeti praardana cheesina veella nee chiththamukai nee eduru chuusi nee balamu ponda sahiyinpa cheesi naa praannamunu thrupthi parachithivee ||deevaa||
నాలోని ప్రాణం తల్లడిల్లిపోగా భూదిగంతములనుండి మొర్ర పెట్టుచున్నాను నా శత్రువుపైనే జయమునిచ్చి నా ఆశ్రయమై ధైర్యమును నింపి నా కోట నీవైతివే
naalooni praannam thalladillipoogaa bhuudiganthamulanundi morra pettuchunnaanu naa shathruvupainee jayamunichchi naa aashrayamai dhairyamunu ninpi naa koota neevaithivee