నీ జీవితములో గమ్యంబు ఏదో

nee jeevithamuloo gamyanbu eedoo

🎵 TG-1731🌐 Telugu
పల్లవి

నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా ఈనాడే నీవు ప్రభు యేసుకొరకు నీ హృదయమర్పించవా (2)     ||నీ జీవితములో||

1వ చరణం

నీ తల్లి గర్భాన నీవుండినపుడే నిను చూచే ప్రభు కన్నులు (2) యోచించలేవా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు (2)         ||నీ జీవితములో||

2వ చరణం

నీలోనే తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను హృదయంపు తలుపు తెరువంగ లేవా యేసు ప్రవేశింపను తన చేతులందు రుధిరంపు ధారల్ స్రవియించే నీకోసమే భరియించె శిక్ష నీకోసమేగా ఒకసారి గమనించావా ప్రభు యేసు నిన్ను సంధించునట్టి సమయంబు యీనాడేగా ఈ చోటనుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరా పోబోకుమో సోదరీ ||నీ జీవితములో||

Report Error