నీ కృప నిత్యముండును నీ

nee krupa nithyamundunu nee

🎵 TG-1715🌐 Telugu
పల్లవి

నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమా యేసయ్యా (2) నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము (2)        ||నీ కృప||

1వ చరణం

శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లె కృతజ్ఞతనిచ్చావు కృపలో నిలిపావు కృంగిన వేళలో నను లేవనెత్తిన చిరునామా నీవేగా ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లె ప్రతి క్షణమున నీవు పలుకరించావు ప్రతికూలమైన పరిస్థితిలన్నియు కనుమరుగైపోయెనే అనుభవ అనురాగం కలకాలమున్నట్లె నీ రాజ్యనియమాలలో నిలువనిచ్చావు రాజమార్గములో నను నడుపుచున్న రారాజువు నీవేగా

Report Error