నీ పిలుపు వలన నేను
nee pilupu valana neenu
నీ పిలుపు వలన నేను నశించిపోలేదు నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటి లేదు (2) నశించుటకు ఎందరో వేచియున్నను నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను ద్రోహము నిందల మధ్యలో నే నడచినను నీ నిర్మల హస్తము నన్ను భరియించెను యజమానుడా నా యజమానుడా… నన్ను పిలచిన యజమానుడా నన్ను నడిపించే యజమానుడా మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు మనోవేదనతో నిన్ను విడిచి పరుగెత్తినను నన్ను వెంటాడి నీ సేవను చేసితివి నా ఆధారమా నా దైవమా పిలిచిన ఈ పిలుపునకు కారణమా పిలిచిన నీవు నిజమైన వాడవు నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు ఏదేమైనను కొనసాగించితివి నీపై ఆధారపడుటకు అర్హుడవు నిన్ను నమ్మెదను వెంబడింతును చిరకాలము నిన్నే సేవింతును (2) ||నీ పిలుపు||
nee pilupu valana neenu nashinchipooleedu nee preema ennadu nannu viduvaleedu nee krupa kaachuta valana jeevisthunnaanu nee preemaku saati leedu (2) nashinchutaku endaroo veechiyunnanu nashinpani nee pilupu nannu kaapaadenu droohamu nindala madhyaloo nee nadachinanu nee nirmala hasthamu nannu bhariyinchenu yajamaanudaa naa yajamaanudaa… nannu pilachina yajamaanudaa nannu nadipinchee yajamaanudaa manussulu muusina thalupulu konnainanu naakai neevu therachinavi aneekamulu manooveedanathoo ninnu vidichi parugeththinanu nannu ventaadi nee seevanu cheesithivi naa aadhaaramaa naa daivamaa pilichina ee pilupunaku kaarannamaa pilichina neevu nijamaina vaadavu nannu hechchinchee aaloochana galavaadavu eedeemainanu konasaaginchithivi neepai aadhaarapadutaku arhudavu ninnu nammedanu venbadinthunu chirakaalamu ninnee seevinthunu (2) ||nee pilupu||