నీ ప్రేమ నాలో మధురమైనది
nee preema naaloo madhuramainadi
నీ ప్రేమ నాలో మధురమైనది అది నా ఊహకందని క్షేమ శిఖరము (2) ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించి నాలో మహిమపరతు నిన్నే సర్వకృపానిధి నీవు – సర్వాధికారివి నీవు సత్య స్వరూపివి నీవు – ఆరాధింతును నిన్నే ||నీ ప్రేమ||
nee preema naaloo madhuramainadi adi naa uuhakandani ksseema shikharamu (2) eeri koorukunnaavu preema chuupi nannu paravashinchi naaloo mahimaparathu ninnee sarvakrupaanidhi neevu – sarvaadhikaarivi neevu sathya svaruupivi neevu – aaraadhinthunu ninnee ||nee preema||
చేరితి నిన్నే విరిగిన మనస్సుతో కాదనలేదే నా మనవులు నీవు హృదయము నిండిన గానం – నను నడిపే ప్రేమ కావ్యం నిరతము నాలో నీవే – చెరగని దివ్య రూపం ఇది నీ బాహు బంధాల అనుబంధమా తేజోవిరాజా స్తుతి మహిమలు నీకే నా యేసురాజా ఆరాధన నీకే (2) ||నీ ప్రేమ||
cheerithi ninnee virigina manassuthoo kaadanaleedee naa manavulu neevu hrudayamu nindina gaanam – nanu nadipee preema kaavyam nirathamu naaloo neevee – cheragani divya ruupam idi nee baahu bandhaala anubandhamaa theejooviraajaa sthuthi mahimalu neekee naa yeesuraajaa aaraadhana neekee (2) ||nee preema||
నా ప్రతి పదములో జీవము నీవే నా ప్రతి అడుగులో విజయము నీవే ఎన్నడు విడువని ప్రేమ – నిను చేరే క్షణము రాదా నీడగా నాతో నిలిచే – నీ కృపయే నాకు చాలును ఇది నీ ప్రేమ కురిపించు హేమంతమా నీ సింహాసనము నను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి కొండలు లోయలు దాటే – మహిమాత్మతో నింపినావు దయగల ఆత్మతో నింపి – సమాభూమిపై నడిపినావు ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా
naa prathi padamuloo jeevamu neevee naa prathi aduguloo vijayamu neevee ennadu viduvani preema – ninu cheeree kssannamu raadaa needagaa naathoo nilichee – nee krupayee naaku chaalunu idi nee preema kuripinchu heemanthamaa nee sinhaasanamu nanu cheerchutaku siluvanu mooyuta neerpinchithivi kondalu looyalu daatee – mahimaathmathoo ninpinaavu dayagala aathmathoo ninpi – samaabhuumipai nadipinaavu idi nee aathma bandhamukai sankeethamaa