నే స్తుతించెదను యేసు నామమును
nee sthuthinchedanu yeesu naamamunu
నే స్తుతించెదను యేసు నామమును భజించెదను క్రీస్తు నామమును స్తుతికి యేసే యోగ్యుడని నిత్యం నిత్యం నే స్తుతించెదను ||నే స్తుతించెదను||
nee sthuthinchedanu yeesu naamamunu bhajinchedanu kreesthu naamamunu sthuthiki yeesee yoogyudani nithyam nithyam nee sthuthinchedanu ||nee sthuthinchedanu||
ఆ ప్రభు కృప ప్రేమ కనికరముల్ వర్ణింప నెవ్వరికి తరమౌనా? (2) పాపిని నన్ను రక్షించుటకై చూపెను ప్రేమనపారముగా (2) ||నే స్తుతించెదను||
aa prabhu krupa preema kanikaramul varnninpa nevvariki tharamaunaa? (2) paapini nannu rakssinchutakai chuupenu preemanapaaramugaa (2) ||nee sthuthinchedanu||
పాపములన్నియు బాపుటకై శాపములన్నియు మాపుటకై ఏ పాపమెరుగని ఆ పావనుడు శాపగ్రాహియై చావొందెను శోధన కాలముల యందున వేదన కాలముల యందున నాధుడు యేసు మనతోడనుండ అంతమేగా మన చింతలకు ఎనలేని ప్రేమతో కౌగిలించెను ఎంచలేని మేళ్ళతో నన్ను నింపెను మహామహుండు మహిమ ప్రధానుడు మహిమతో వచ్చును మేఘముపై రాజాధిరాజు ప్రభు యేసే దేవాదిదేవుడు మన యేసే పరమందు దూతలు యిహమందు నరులు పాడుడి ప్రభునకు హల్లెలూయా
paapamulanniyu baaputakai shaapamulanniyu maaputakai ee paapamerugani aa paavanudu shaapagraahiyai chaavondenu shoodhana kaalamula yanduna veedana kaalamula yanduna naadhudu yeesu manathoodanunda anthameegaa mana chinthalaku enaleeni preemathoo kaugilinchenu enchaleeni meellllathoo nannu ninpenu mahaamahundu mahima pradhaanudu mahimathoo vachchunu meeghamupai raajaadhiraaju prabhu yeesee deevaadideevudu mana yeesee paramandu duuthalu yihamandu narulu paadudi prabhunaku halleluuyaa