నీలాంటి ప్రేమ ఈ లోకాన
neelaanti preema ee lookaana
నీలాంటి ప్రేమ ఈ లోకాన ఎవరైనా చూపారా? – (2) నా పాపభారం ఆ సిలువపైన ఎవరైనా మోశారా? – యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. ఓ యేసయ్యా (2) ||నీలాంటి||
neelaanti preema ee lookaana evarainaa chuupaaraa? – (2) naa paapabhaaram aa siluvapaina evarainaa mooshaaraa? – yeesayyaa.. yeesayyaa.. yeesayyaa.. oo yeesayyaa (2) ||neelaanti||
చెలికాడే నిన్ను సిలువకు పంపగా పరిసయ్యులే నిన్ను పరిహసించగా నోరు తెరువని ప్రేమ బదులు పలుకని ప్రేమ (2) ||యేసయ్యా||
chelikaadee ninnu siluvaku panpagaa parisayyulee ninnu parihasinchagaa nooru theruvani preema badulu palukani preema (2) ||yeesayyaa||
దొంగలే నిన్ను దూషించగను నా అనువారే అపహసించగా తండ్రి వీరు చేయునదేమో ఎరుగరు కనుక క్షమియించుమని ప్రార్ధన చేసితివయ్యా మము క్షమియించితివయ్యా నీ దివ్య ప్రేమను ప్రకటింతునయ్యా ఆ ప్రేమ మార్గములో నడిచెదనయ్యా నీదు ప్రేమే నా గానం నీ ప్రేమే నా భాగ్యం
dongalee ninnu duussinchaganu naa anuvaaree apahasinchagaa thandri veeru cheeyunadeemoo erugaru kanuka kssamiyinchumani praardhana cheesithivayyaa mamu kssamiyinchithivayyaa nee divya preemanu prakatinthunayyaa aa preema maargamuloo nadichedanayyaa needu preemee naa gaanam nee preemee naa bhaagyam