నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను

neeneemainaa prabhuvaa ninnee sthuthisthaanu

🎵 TG-1373🌐 Telugu
పల్లవి

నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను (2) నేనేమైయున్నానో నీ దయ వలనేనయ్యా నాకున్నవన్నియు నీవిచ్చినవేనయ్యా (2)       ||నేనేమైనా||

1వ చరణం

లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే ఇచ్చిన నీవే బలి కోరగా తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా ||నేనేమైనా||

2వ చరణం

సర్వము పోయి శరీరము కుళ్ళిన నా అనువారే వెలివేసినా ఆప్తులంతా శత్రువులైనా అంతము వరకు సహియించిన ఆ యోబులా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైనా అది నాకెంతో మేలే ఇదిగో నేను ఉన్నానయ్యా దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా

Report Error