నీతో నుండని బ్రతుకు

neethoo nundani brathuku

🎵 TG-1436🌐 Telugu
పల్లవి

నీతో నుండని బ్రతుకు – నిను చూడని క్షణము ఊహించలేను నా యేసయ్యా నిను చూడని క్షణము – నీతో నుండని బ్రతుకు (2) నీదు స్వరము వినకనే నేను నిను విడచి తిరిగితి నేను నాదు బ్రతుకులో సమస్తము కోలిపొయితి (2)          ||నిను||

1వ చరణం

నీ దివ్య ప్రేమను విడచి – నీ ఆత్మ తోడు త్రోసివేసి అంధకార త్రోవలో నడచి – నీ గాయమే రేపితిని అయినా అదే ప్రేమ – నను చేర్చుకున్నప్రేమ నను వీడని కరుణ – మరువలేనయ్యా యేసయ్యా ||నీతో||

2వ చరణం

నను హత్తుకున్న ప్రేమ – నను చేర్చుకున్న ప్రేమ నీ వెలుగులోనే నిత్యం – నే నడిచెదన్ నను విడువకు ప్రియుడా – నాకు తోడుగా నడువు నీతోనే నా బ్రతుకు – సాగింతును యేసయ్యా ||నిను||

Report Error