నీటి వాగుల కొరకు దుప్పి
neeti vaagula koraku duppi
నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతియించుమా నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా – (2) ||నా ప్రాణమా||
neeti vaagula koraku duppi aashinchunatlu nee koraku naa praannamu dappigonuchunnadi naa praannamaa naa samasthamaa prabhuni sthuthiyinchumaa naa yeesu cheesina meelllanu neevu maruvakumaa – (2) ||naa praannamaa||
పనికిరాని నను నీవు పైకి లేపితివి క్రీస్తని బండపైన నన్ను నిలిపితివి (2) నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు నే వెంబడింతు ప్రభు ||నా ప్రాణమా||
panikiraani nanu neevu paiki leepithivi kreesthani bandapaina nannu nilipithivi (2) naa adugulu sthiraparachi balamunichchithivi needu adugu jaadalanee venbadinthu prabhu nee venbadinthu prabhu ||naa praannamaa||
అంధకారపు లోయలలో నేను నడచితిని ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి కంటిపాపగా నీవు నన్ను కాచితివి కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను నిన్ను కొలిచెదను నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు ఆత్మ ఫలమును దండిగా నీకై ఫలియింతును నీవు చేసిన మేళ్లను నేను ఎట్లు మరతు ప్రభు నీ కొరకు సాక్షిగా ఇలలో జీవింతును నే ఇలలో జీవింతును
andhakaarapu looyalaloo neenu nadachithini ee apaayamu raakundaa nannu nadipithivi kantipaapagaa neevu nannu kaachithivi kanna thandrivi neevani ninnu kolichedanu ninnu kolichedanu needu aathmathoo nindugaa nannu ninpu prabhu aathma phalamunu dandigaa neekai phaliyinthunu neevu cheesina meelllanu neenu etlu marathu prabhu nee koraku saakssigaa ilaloo jeevinthunu nee ilaloo jeevinthunu