నిజమైన ద్రాక్షావల్లి నీవే నిత్యమైన
nijamaina draakssaavalli neevee nithyamaina
నిజమైన ద్రాక్షావల్లి నీవే నిత్యమైన సంతోషము నీలోనే (2) శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ – (2) ||నిజమైన||
nijamaina draakssaavalli neevee nithyamaina santhoossamu neeloonee (2) shaashvathamainadi enthoo madhuramainadi naapaina neekunna preema enaleeni nee preema – (2) ||nijamaina||
అతి కాంక్షనీయుడా దివ్యమైన నీ రూపులో జీవించున్నాను నీ ప్రేమకు నే పత్రికగా శిధిలమై యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా షాలేము రాజా రమ్యమైన సీయోనుకే నను నడిపించుము నీ చిత్తమైన మార్గములో అలసి పోనివ్వక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణ కర్తవై నను చేర్చుము నీ రాజ్యములో
athi kaankssaneeyudaa divyamaina nee ruupuloo jeevinchunnaanu nee preemaku nee pathrikagaa shidhilamai yundagaa nannu needu rakthamuthoo kadigi nee poolikagaa maarchinaavee naa yeesayyaa naa praanna priyudaa shreesstamaina phalamulathoo arpinchuchunnaanu sarvamu neekee arpannagaa vaadipoonivvaka naaku aashrayamaithivi neevu jeevapu uutavai balaparachithivi naa yeesayyaa ssaaleemu raajaa ramyamaina seeyoonukee nanu nadipinchumu nee chiththamaina maargamuloo alasi poonivvaka nannu needu aathmathoo ninpi aadaranna karthavai nanu cheerchumu nee raajyamuloo