నూతన సంవత్సరం దయచేసిన దేవా

nuuthana sanvathsaram dayacheesina deevaa

🎵 TG-2619🌐 Telugu
పల్లవి

నూతన సంవత్సరం దయచేసిన దేవా నీకే స్తోత్రములు అద్వితీయ ప్రభువా (2) ఆశ్చర్యకరుడవు ఆది సంభూతుడవు అద్భుతకరుడవు అల్ఫా ఓమెగవు (2)         ||నూతన ||

1వ చరణం

పాపాంధకారమునకు బానిసనై యున్నప్పుడు శాపముతో నేను హీనుడనై యున్నప్పుడు చేతులు చాచి నన్ను లేవనెత్తిన దేవా ప్రేమతో పిలిచి నన్ను ఆదరించిన ప్రభువా నీ ప్రేమ పిలుపుకు నే ఘనుడనైతిని నీ స్పర్శ తాకిడికి ఆత్మ పూర్ణుడైతిని ||నూతన||

2వ చరణం

కడవరి దినాలలో కంట నీరు పెడుతుండగా కష్టాలతో నేను సతమతమౌతుండగా నీ వాక్య వెలుగులో నడిపించిన నా ప్రభువా ఏ దిక్కు లేని నాకు దారి చూపిన తండ్రి నీ జాలి హృదయమునకు దాసుడ నేనైతిని నీ వాక్య జ్ఞానమునకు పరిచారకుడనైతిని

Report Error