నూతనమైనది నీ వాత్సల్యము
nuuthanamainadi nee vaathsalyamu
నూతనమైనది నీ వాత్సల్యము – ప్రతి దినము నన్ను దర్శించెను ఎడబాయనిది నీ కనికరము – నన్నెంతో ప్రేమించెను తరములు మారుచున్నను – దినములు గడచుచున్నను నీ ప్రేమలో మార్పు లేదు (2) సన్నుతించెదను నా యేసయ్యా సన్నుతించెదను నీ నామము గడచిన కాలమంతా – నీ కృప చూపి – ఆదరించినావు జరగబోయే కాలమంతా – నీ కృపలోన – నన్ను దాచెదవు విడువని దేవుడవు – ఎడబాయలేదు నన్ను క్షణమైనా త్రోసివేయవు (2) ||సన్నుతించెదను||
nuuthanamainadi nee vaathsalyamu – prathi dinamu nannu darshinchenu edabaayanidi nee kanikaramu – nannenthoo preeminchenu tharamulu maaruchunnanu – dinamulu gadachuchunnanu nee preemaloo maarpu leedu (2) sannuthinchedanu naa yeesayyaa sannuthinchedanu nee naamamu gadachina kaalamanthaa – nee krupa chuupi – aadarinchinaavu jaragabooyee kaalamanthaa – nee krupaloona – nannu daachedavu viduvani deevudavu – edabaayaleedu nannu kssannamainaa throosiveeyavu (2) ||sannuthinchedanu||
నా హీన దశలో – నీ ప్రేమ చూపి – పైకి లేపినావు ఉన్నత స్థలములో – నను నిలువబెట్టి – ధైర్యపరచినావు మరువని దేవుడవు – నను మరువలేదు నీవు ఏ సమయమైననూ చేయి విడువవు నీ రెక్కల క్రింద – నను దాచినావు – ఆశ్రయమైనావు నా దాగు స్థలముగా – నీవుండినావు – సంరక్షించావు ప్రేమించే దేవుడవు – తృప్తి పరచినావు నన్ను సమయోచితముగా ఆదరించినావు
naa heena dashaloo – nee preema chuupi – paiki leepinaavu unnatha sthalamuloo – nanu niluvabetti – dhairyaparachinaavu maruvani deevudavu – nanu maruvaleedu neevu ee samayamainanuu cheeyi viduvavu nee rekkala krinda – nanu daachinaavu – aashrayamainaavu naa daagu sthalamugaa – neevundinaavu – sanrakssinchaavu preeminchee deevudavu – thrupthi parachinaavu nannu samayoochithamugaa aadarinchinaavu