న్యాయాధిపతియైన దేవుడు – నిన్ను
nyaayaadhipathiyaina deevudu – ninnu
న్యాయాధిపతియైన దేవుడు – నిన్ను పిలిచే వేళలోన ఏ గుంపులో ఉంటావో తెలుసుకో – మరలా వచ్చే వేళలోన (2) ఒక గుంపేమో పరలోకపు గుంపు రక్షింపబడిన వారికే అది సొంతం మరు గుంపేమో ఘోర నరకపు గుంపు నిజ దేవుని ఎరుగని వారికి అది అంతం ||న్యాయాధిపతి||
nyaayaadhipathiyaina deevudu – ninnu pilichee veellaloona ee gunpuloo untaavoo thelusukoo – maralaa vachchee veellaloona (2) oka gunpeemoo paralookapu gunpu rakssinpabadina vaarikee adi sontham maru gunpeemoo ghoora narakapu gunpu nija deevuni erugani vaariki adi antham ||nyaayaadhipathi||
నీవు కాదు నీ క్రియలు కాదు – ఆ పరముకు నిను చేర్చేది కాదు కాదు వేరెవరో కాదు – మరణమును తప్పించేది కలువరిలో తన ప్రాణం పెట్టిన యేసయ్యే నీ ప్రాణ రక్షణ సిలువలో క్రయ ధనమే చెల్లించిన ఆ ప్రభువే నీ పాప విమోచన ||ఒక గుంపేమో||
neevu kaadu nee kriyalu kaadu – aa paramuku ninu cheercheedi kaadu kaadu veerevaroo kaadu – marannamunu thappincheedi kaluvariloo thana praannam pettina yeesayyee nee praanna rakssanna siluvaloo kraya dhanamee chellinchina aa prabhuvee nee paapa vimoochana ||oka gunpeemoo||
ఇదియే సమయం ఇక లేదే తరుణం – నీ పాపము ఒప్పుకొనుటకు ఆ పరలోకం చేరే మార్గం – యేసేగా ప్రతి ఒక్కరకు మేఘముపై రానైయున్నాడుగా త్వరలోనే నిను కొనిపోడానికి వెనుదీయకు ఓ నా ప్రియ నేస్తమా నీ హృదిలో స్వీకరించడానికి
idiyee samayam ika leedee tharunnam – nee paapamu oppukonutaku aa paralookam cheeree maargam – yeeseegaa prathi okkaraku meeghamupai raanaiyunnaadugaa thvaraloonee ninu konipoodaaniki venudeeyaku oo naa priya neesthamaa nee hrudiloo sveekarinchadaaniki