ఓ దేవా దయ చూపుమయ్యా
oo deevaa daya chuupumayyaa
ఓ దేవా దయ చూపుమయ్యా దేశాన్ని బాగుచేయుమయ్యా నీ ప్రజల మొరను అలకించుమా నీ కృపలో మమ్మును నడిపించుమా మన్నించి బ్రతికించు – ఉజ్జీవం రగిలించు ||ఓ దేవా||
oo deevaa daya chuupumayyaa deeshaanni baagucheeyumayyaa nee prajala moranu alakinchumaa nee krupaloo mammunu nadipinchumaa manninchi brathikinchu – ujjeevam ragilinchu ||oo deevaa||
సర్వలోక రక్షకా – కరుణించుమయ్యా నీ వాక్య శక్తిని – కనుపరచుమయ్యా అంధకార ప్రజలను – వెలిగించుమయ్యా పునరుత్ధాన శక్తితో – విడిపించుమయ్యా ఒకసారి చూడు – ఈ పాప లోకం నీ రక్తంతో కడిగి – పరిశుద్ధపరచు దేశాన్ని క్షమియించు – ప్రేమతో రక్షించు
sarvalooka rakssakaa – karunninchumayyaa nee vaakya shakthini – kanuparachumayyaa andhakaara prajalanu – veliginchumayyaa punaruthdhaana shakthithoo – vidipinchumayyaa okasaari chuudu – ee paapa lookam nee rakthanthoo kadigi – parishuddhaparachu deeshaanni kssamiyinchu – preemathoo rakssinchu