ఓ క్రైస్తవ యువకా - నిజమంతయు గనుమా
oo kraisthava yuvakaa - nijamanthayu ganumaa
ఓ క్రైస్తవ యువకా - నిజమంతయు గనుమా నీ బ్రతుకంతా మారుటమేలు - కోరుము జీవమునే (2)
oo kraisthava yuvakaa - nijamanthayu ganumaa nee brathukanthaa maarutameelu - koorumu jeevamunee (2)
పాపపు చీకటి బ్రతుకేలా - శాపము భారము నీకేలా పావన యేసుని పాదము జేరిన - జీవము నీ దగురా ||ఓ క్రైస్తవ||
paapapu cheekati brathukeelaa - shaapamu bhaaramu neekeelaa paavana yeesuni paadamu jeerina - jeevamu nee daguraa ||oo kraisthava||
మారిన జీవిత తీరులలో - మానక నీప్రభు సేవకురా మహిమ కిరీటము మనకొసగును - ఘనమే నీ దగురా ||ఓ క్రైస్తవ||
maarina jeevitha theerulaloo - maanaka neeprabhu seevakuraa mahima kireetamu manakosagunu - ghanamee nee daguraa ||oo kraisthava||
భయపడి వెనుకకు పరుగిడక - బలమగు వైరిని గెలిచెదవా బలమగు ప్రభుని వాక్యము నమ్మిన - గెలుపే నీదగురా ||ఓ క్రైస్తవ||
bhayapadi venukaku parugidaka - balamagu vairini gelichedavaa balamagu prabhuni vaakyamu nammina - gelupee needaguraa ||oo kraisthava||