ఓ మానవా.. నీ పాపం
oo maanavaa.. nee paapam
ఓ మానవా.. నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా (2) పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము పాపములోనే మరణించినచో తప్పదు నరకము (2) ||ఓ మానవా||
oo maanavaa.. nee paapam maanavaa yeesayya chentha cheeri nee brathuku maarchavaa (2) paapamuloonee brathukuchunnachoo chedunu nee deehamu paapamuloonee maranninchinachoo thappadu narakamu (2) ||oo maanavaa||
ఎంత కాలము పాపములోనే బ్రతుకుచుందువు ఎంత కాలము శాపములోనే కొట్టబడుదువు ఎంత కాలము వ్యసనపరుడవై తిరుగుచుందువు ఎంత కాలము దుఃఖములోనే మునిగియుందువు యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము యేసయ్య తన రక్తంతో నీ పాపం కడుగును ఎంత కాలము దేవుని విడిచి తిరుగుచుందువు ఎంత కాలము దేవుడు లేక బ్రతుకుచుందువు ఎంత కాలము దేవుని మాటను ఎదిరించెదవు ఎంత కాలము దేవుని నీవు దుఃఖపరతువు యెసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను యెసయ్యే నిను రక్షించి పరమున చేర్చును
entha kaalamu paapamuloonee brathukuchunduvu entha kaalamu shaapamuloonee kottabaduduvu entha kaalamu vyasanaparudavai thiruguchunduvu entha kaalamu duhkhamuloonee munigiyunduvu yeesuni nammi paapamu nundi vidudala pondumu yeesayya thana rakthanthoo nee paapam kadugunu entha kaalamu deevuni vidichi thiruguchunduvu entha kaalamu deevudu leeka brathukuchunduvu entha kaalamu deevuni maatanu edirinchedavu entha kaalamu deevuni neevu duhkhaparathuvu yesayyee nee paapam koraku praannam pettenu yesayyee ninu rakssinchi paramuna cheerchunu