ఓ...మానవుండ నీ గతి ఏమౌనో తెలియునా
oo...maanavunda nee gathi eemaunoo theliyunaa
ఓ...మానవుండ నీ గతి ఏమౌనో తెలియునా ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా ? ఆహా.... ఆ...ఆ...అంత్య తీర్పునందునా.. యేసు నీ రక్షకుడే మహా భయంకరమో - సింహంబుగా నుండు ||ఓ...మానవుండ నీ||
oo...maanavunda nee gathi eemaunoo theliyunaa eemeemi cheeyuchuntivoo thappinchukonduvaa ? aahaa.... aa...aa...anthya theerpunandunaa.. yeesu nee rakssakudee mahaa bhayankaramoo - sinhanbugaa nundu ||oo...maanavunda nee||
లోకాలు పుట్టి నప్పటి - నుండి మృతులైనా ఏ కులాజుడైన నాటికి - తీర్పులో నిలచును ||ఓ...మానవుండ నీ||
lookaalu putti nappati - nundi mruthulainaa ee kulaajudaina naatiki - theerpuloo nilachunu ||oo...maanavunda nee||
మృతులైన ఘనులు హీనులు - యేసయ్య యెదుటను ప్రతివారు నిలచి యుందురు - బ్రతికిన రీతిగనే ||ఓ...మానవుండ నీ||
mruthulaina ghanulu heenulu - yeesayya yedutanu prathivaaru nilachi yunduru - brathikina reethiganee ||oo...maanavunda nee||
గ్రంధాలు విప్ప బడగ - గ్రంధాలలో వారి గ్రంధంబు బట్టబయలై - పొందుదురు తీర్పును ||ఓ...మానవుండ నీ||
grandhaalu vippa badaga - grandhaalaloo vaari grandhanbu battabayalai - ponduduru theerpunu ||oo...maanavunda nee||
నరులెల్ల క్రియల చొప్పున - మరి తీర్పు పొందుదురు మరణము మృతుల లోకము - గురియౌను అగ్నికి ||ఓ...మానవుండ నీ||
narulella kriyala choppuna - mari theerpu ponduduru marannamu mruthula lookamu - guriyaunu agniki ||oo...maanavunda nee||
ఈ నాడు నీవు కూడను - యేసుని విడచినచో ఆనాడు నీవు కూడను - అందుండి యేడ్చెదవు ||ఓ...మానవుండ నీ||
ee naadu neevu kuudanu - yeesuni vidachinachoo aanaadu neevu kuudanu - andundi yeedchedavu ||oo...maanavunda nee||
దేవుని జీవ గ్రంధము - దేవుడు తెరచును ఎవ్వని పేరందుండదో - వాడగ్నిలో బడును ||ఓ...మానవుండ నీ||
deevuni jeeva grandhamu - deevudu therachunu evvani peerandundadoo - vaadagniloo badunu ||oo...maanavunda nee||