పాడెద దేవా – నీ
paadeda deevaa – nee
పాడెద దేవా – నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్ – స్తుతి స్తోత్రము చెల్లింతున్ (2) భూమి పునాదులు వేయకముందే యేసులో చేసితివి ప్రేమ పునాదులు వేసితివి దీనుని బ్రోచితివి – ఈ దీనుని బ్రోచితివి (2) ||పాడెద||
paadeda deevaa – nee krupalan nuuthana geethamulan sthoothramu chellinthun – sthuthi sthoothramu chellinthun (2) bhuumi punaadulu veeyakamundee yeesuloo cheesithivi preema punaadulu veesithivi deenuni broochithivi – ee deenuni broochithivi (2) ||paadeda||
ప్రవిమల రక్తము కలువరి సిలువలో కలునకు నిచ్చితివి ప్రేమ కృపా మహదైశ్వర్యములతో పాపము తుడిచితివి – నా పాపము తుడిచితివి పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి అపరాధములచే చచ్చిన నన్ను ధర బ్రతికించితివి – నన్ను బ్రతికించితివి దేవుని రాజ్యపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి చీకటి రాజ్యపు శక్తుల నుండి నను విడిపించితివి – చెర నను విడిపించితివి ముద్రించితివి శుద్ధాత్మతో నను భద్రము చేసితివి సత్యస్వరూప నిత్యనివాసి సొత్తుగా చేసితివి – నీ సొత్తుగా చేసితివి అన్యుడనై నిను ఎరుగక యున్నను ధన్యుని చేసితివి ప్రియ పట్టణ పౌరుల సేవింపను వరముల నొసగితివి – కృప వరముల నొసగితివి
pravimala rakthamu kaluvari siluvaloo kalunaku nichchithivi preema krupaa mahadaishvaryamulathoo paapamu thudichithivi – naa paapamu thudichithivi paapamu shaapamu narakapu veedana mari tholaginchithivi aparaadhamulachee chachchina nannu dhara brathikinchithivi – nannu brathikinchithivi deevuni raajyapu vaarasudanugaa kreesthuloo cheesithivi cheekati raajyapu shakthula nundi nanu vidipinchithivi – chera nanu vidipinchithivi mudrinchithivi shuddhaathmathoo nanu bhadramu cheesithivi sathyasvaruupa nithyanivaasi soththugaa cheesithivi – nee soththugaa cheesithivi anyudanai ninu erugaka yunnanu dhanyuni cheesithivi priya pattanna paurula seevinpanu varamula nosagithivi – krupa varamula nosagithivi