పాపానికి నాకు ఏ సంబంధం
paapaaniki naaku ee sanbandham
పాపానికి నాకు ఏ సంబంధం లేదు పాపానికి నాపై ఏ అధికారము లేదు పాపానికి నాపై ఏ అజమాయిషీ లేదు నా పాపములు అన్ని – నా ప్రభువు ఏనాడో క్షమియించివేసాడుగా మరి వాటినెన్నడును – జ్ఞాపకము చేసికొనెను అని మాట ఇచ్చాడుగా నేనున్నా నేనున్నా – నా యేసుని కృప క్రింద నే లేను నే లేను – ధర్మశాస్త్రం క్రింద (2) ||పాపానికి||
paapaaniki naaku ee sanbandham leedu paapaaniki naapai ee adhikaaramu leedu paapaaniki naapai ee ajamaayissee leedu naa paapamulu anni – naa prabhuvu eenaadoo kssamiyinchiveesaadugaa mari vaatinennadunu – jnyaapakamu cheesikonenu ani maata ichchaadugaa neenunnaa neenunnaa – naa yeesuni krupa krinda nee leenu nee leenu – dharmashaasthram krinda (2) ||paapaaniki||
కృప ఉందని పాపం చెయ్యొచ్చా – అట్లనరాదు కృప ఉందని నీతిని విడువోచ్చా (అట్లనరాదు) కృప అంటే లైసెన్స్ కాదు కృప అంటే ఫ్రీ పాస్ కాదు – పాపాన్ని చేసేందుకు కృప అంటే దేవుని శక్తి కృప అంటే దేవుని నీతి – పాపాన్ని గెలిచేందుకు గ్రేస్ ఈస్ నాట్ ఎ లైసెన్స్ టు సిన్ ఇట్స్ ఎ పవర్ ఆఫ్ గాడ్ టు ఓవర్ కం (4) ||నేనున్నా||
krupa undani paapam cheyyochchaa – atlanaraadu krupa undani neethini viduvoochchaa (atlanaraadu) krupa antee laisens kaadu krupa antee phree paas kaadu – paapaanni cheeseenduku krupa antee deevuni shakthi krupa antee deevuni neethi – paapaanni gelicheenduku grees ees naat e laisens tu sin its e pavar aaph gaad tu oovar kam (4) ||neenunnaa||
కృప ద్వారా ధర్మశాస్త్రముకు – మృతుడను అయ్యా కృప వలన క్రీస్తులో స్వాతంత్య్రం (నే పొందితినయ్యా) క్రియల మూలముగా కాదు కృపయే నను రక్షించినది – నా భారం తొలగించినది కృప నన్ను మార్చేసినది నీతి సద్భక్తుల తోడ – బ్రతుకమని బోధించినది గ్రేస్ టుక్ అవే బర్డెన్ ఫ్రమ్ మి అండ్ టాట్ మి టు లివ్ రైటియస్లీ పాపానికి మృతుడను నేనయ్యా – హల్లెలూయా కృప వలనే ఇది నాకు సాధ్యం (అయ్యిందిరా భయ్యా) (2) కృపను రుచి చూచిన నేను దేవునికే లోబడుతాను – పాపానికి చోటివ్వను పరిశుద్ధత పొందిన నేను నీతి సాధనములుగానే – దేహం ప్రభుకర్పింతును యీల్డ్ యువర్ బాడీస్ అంటు ద లార్డ్ యాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ రైటియస్నెస్ ధర్మశాస్త్రం పాపం అయ్యిందా – అట్లనరాదు ధర్మశాస్త్రం వ్యర్థం అయ్యిందా (అట్లనరాదు) ధర్మశాస్త్రం కొంత కాలమేగా ధర్మశాస్త్రం బాలశిక్షయేగా – ప్రభునొద్దకు నడిపేందుకు క్రీస్తొచ్చి కృప తెచ్చెనుగా ధర్మశాస్త్రం నెరవేర్చెనుగా – మనలను విడిపించేందుకు లా హాస్ లెడ్ పీపుల్ టు క్రైస్ట్ నౌ గ్రేస్ విల్ మేక్ అస్ కాంకరర్స్
krupa dvaaraa dharmashaasthramuku – mruthudanu ayyaa krupa valana kreesthuloo svaathanthyram (nee pondithinayyaa) kriyala muulamugaa kaadu krupayee nanu rakssinchinadi – naa bhaaram tholaginchinadi krupa nannu maarcheesinadi neethi sadbhakthula thooda – brathukamani boodhinchinadi grees tuk avee barden phram mi and taat mi tu liv raitiyaslee paapaaniki mruthudanu neenayyaa – halleluuyaa krupa valanee idi naaku saadhyam (ayyindiraa bhayyaa) (2) krupanu ruchi chuuchina neenu deevunikee loobaduthaanu – paapaaniki chootivvanu parishuddhatha pondina neenu neethi saadhanamulugaanee – deeham prabhukarpinthunu yeeld yuvar baadees antu da laard yaas instruments aaph raitiyasnes dharmashaasthram paapam ayyindaa – atlanaraadu dharmashaasthram vyartham ayyindaa (atlanaraadu) dharmashaasthram kontha kaalameegaa dharmashaasthram baalashikssayeegaa – prabhunoddaku nadipeenduku kreesthochchi krupa thechchenugaa dharmashaasthram neraveerchenugaa – manalanu vidipincheenduku laa haas led peepul tu kraist nau grees vil meek as kaankarars