ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి
phalamulanaashinchina paralooka thandri theeri
ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు (2) ప్రేమతో నిను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు ఫలియించకుండుట నీకు న్యాయమా యజమాని సహనముతో చెలగాటమా ఐగుప్తు నుండి పెరికి తెచ్చినాడు సంఘ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు చుట్టు త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు తన స్వాస్థ్యముగా నిను ప్రత్యేకపరచినాడు (2) ||ఫలియించకుండుట||
phalamulanaashinchina paralooka thandri theeri chuuchuchunnaadu nee vaipu (2) preemathoo ninu penchina priya thootamaali pareekssinchuchunnaadu nee kaapu phaliyinchakunduta neeku nyaayamaa yajamaani sahanamuthoo chelagaatamaa aigupthu nundi periki thechchinaadu sangha draakssa thootaloo ninnu naatinaadu chuttu thravvi eruvu veesi neeru poosinaadu thana svaasthyamugaa ninu prathyeekaparachinaadu (2) ||phaliyinchakunduta||
వెదకినప్పుడు నీ యొద్ద ఫలము లేక యుంటే ఆకులతో నిను చూసి తండ్రి సంతసించునా ఇవ్వబడిన సమయములో వర్ధిల్లకుంటే మోడులాంటి నిన్ను ఇంక నరికివేయకుండునా
vedakinappudu nee yodda phalamu leeka yuntee aakulathoo ninu chuusi thandri santhasinchunaa ivvabadina samayamuloo vardhillakuntee moodulaanti ninnu inka narikiveeyakundunaa