పిలచుచున్నాడు ప్రియమైన యేసు
pilachuchunnaadu priyamaina yeesu
పిలచుచున్నాడు ప్రియమైన యేసు పరిశుద్ధ స్థలమునకు ఎంత పాపివైనా ప్రేమించినాడు నీ జీవితమును ఏ భేదము లేక వేగమే రారండి నీవు నీ ఇంటి వారు నీతోనే ఉండువారు నిజమైన దేవుడని విశ్వసించుటకు ||పిలచు||
pilachuchunnaadu priyamaina yeesu parishuddha sthalamunaku entha paapivainaa preeminchinaadu nee jeevithamunu ee bheedamu leeka veegamee raarandi neevu nee inti vaaru neethoonee unduvaaru nijamaina deevudani vishvasinchutaku ||pilachu||
వెలుగై యున్నవాడు నీ చీకటి తొలగిస్తాడు మంచి గంధపు మాటలు నీ మదిలో కురిపిస్తాడు రా .. ఏ రోగివైననూ నీ పాపాలు కడుగును మారుమనస్సు పొంది ప్రేమ కలిగియుండి ప్రభుయేసు దేవుడని సాక్ష్యమిచ్చుటకు ||పిలచు||
velugai yunnavaadu nee cheekati tholagisthaadu manchi gandhapu maatalu nee madiloo kuripisthaadu raa .. ee roogivainanuu nee paapaalu kadugunu maarumanassu pondi preema kaligiyundi prabhuyeesu deevudani saakssyamichchutaku ||pilachu||
మేడి చెట్టు ఎక్కి మరుగై యుండలేవు యేసు వచ్చు వేళ నిదురించకు ప్రభుని మరచి రా .. దిగి రమ్ము క్రిందకి ఏ అధికారివైననూ - యేసు నీ యింటికి వచ్చి నేడే రక్షణ ఇచ్చి- పరలోక రాజ్యములో నిన్ను చేర్చుటకు ||పిలచు||
meedi chettu ekki marugai yundaleevu yeesu vachchu veella nidurinchaku prabhuni marachi raa .. digi rammu krindaki ee adhikaarivainanuu - yeesu nee yintiki vachchi needee rakssanna ichchi- paralooka raajyamuloo ninnu cheerchutaku ||pilachu||